కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ కి కాకాణి..

26వతేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పగింత

గ్రావెల్ తవ్వకాలు, ఫోర్జరీ సంతకాల కేసులపై విచారణ

కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ కి కాకాణి…

  • 26వతేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పగింత
  • గ్రావెల్ తవ్వకాలు, ఫోర్జరీ సంతకాల కేసులపై విచారణ

అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫోర్జరీ సంతకాల కేసులలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని రెండు కేసులలో విచారించేందుకు సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీసుస్టేషన్ కు కాకాణికి తరలించారు. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫోర్జరీ సంతకాల కేసులపై కాకాణిని అధికారులు విచారించనున్నారు. ఏది ఏమైనప్పటికీ మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్థన్‌రెడ్డి బెయిల్ వ్యవ‌హారం ఓ కొలిక్కి రాక‌ముందే..కేసుల మీద కేసులు ఆయ‌న‌కు చుట్టుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *