15 కిలోల గంజాయి పట్టివేత

కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్న కావలి ఆర్ పీఎఫ్ పోలీసులు

గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన మహిళ, బీహార్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

వివరాలు వెల్లడించిన నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్

15 కిలోల గంజాయి పట్టివేత

  • కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్న కావలి ఆర్ పీఎఫ్ పోలీసులు
  • గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన మహిళ, బీహార్ కు చెందిన వ్యక్తి అరెస్ట్
  • వివరాలు వెల్లడించిన నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్

కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న వారిని కావలి ఆర్ పీఎఫ్ పోలీసులు
పట్టుకున్నారు. మంగళవారం
నెల్లూరు రైల్వే డిఎస్పీ మురళీధర్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు. రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాల్లో
తనిఖీలు చేస్తుండగా స్టేషన్ ఉత్తర భాగంలో ఓ మహిళ, మరో వ్యక్తితో అనుమాన స్పదంగా కానొచ్చారన్నారు. వీరిని పరిశీలించగా వీరి వద్ద గంజాయి గుర్తించడం జరిగిందన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 15.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. పట్టుబడిన మహిళ తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి జిల్లా రాంజీనగర్ లోని మిల్ కాలానికి చెందిన తవామణి కాగా, బీహార్ రాష్ట్రం పాట్నాలోని బైకట్ పూర్ కు చెందిన సురజ్ కుమార్ గా గుర్తించారు. ఈ సమావేశంలో రైల్వే ఎస్సై రమాదేవి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *