ఓ కెమెరాను పగలగొట్టినా.. మరో సీసీ కెమెరా వాళ్లను చిత్రీకరించేసింది
నెల్లూరు మండపాల వీధిలో అర్థరాత్రి దాటాక చోరీ యత్నం -ఎన్-3 ఎక్స్‌క్లూజివ్
భారీ దోపిడీకి యత్నించిన దొంగలు..!
-సీసీ కెమెరాలున్నాయన్న విషయం
మరచి దోపిడీకి యత్నం
-ఓ కెమెరాను పగలగొట్టినా.. మరో సీసీ కెమెరా వాళ్లను చిత్రీకరించేసింది
-నెల్లూరు మండపాల వీధిలో అర్థరాత్రి దాటాక చోరీ యత్నం
ఎన్-3 ఎక్స్‌క్లూజివ్
అర్థరాత్రి సమయంలో.. ఎవరూ లేనిది గమనించి.. తనను మూడో కన్ను గమనిస్తుంటుందనికూడా మరచిపోయి.. గోల్డ్ కొల్లగొట్టడమే లక్ష్యంగా ఓ వ్యక్తి.. ఓ గోల్డ్ షాపును లూఠీ చేసేందుకు యత్నించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరం.. మండపాల వీధిలోని కేబీ హైట్స్‌లోని ఓ గోల్డ్ షాపులో సోమవారం అర్థరాత్రి దాటాక ఇద్దరు వ్యక్తులు దోపిడీకి విఫలయత్నం చేశారు. గడ్డపార.. రాడ్డులతో.. ఆ బిల్డింగ్‌లోకి ప్రవేశించి.. ఆ గోల్డ్ షాపును తెరచేందుకు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న ఓ సీపీ కెమెరాను కూడా పగలగొట్టే యత్నం చేశారు. ఎంతకీ అది తెరుచుకోకపోవడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఆ గోల్డ్ షాపు ఓనర్లు షాపు తెరచే సమయంలో.. షెట్టర్‌ను పగలగొట్టి ఉండటం గమనించి… లోపల పరిశీలించారు. అయితే.. చోరీ జరగలేదని నిర్థారించుకుని.. వారు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సంతపేట సీఐ, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ కాంప్లెక్స్‌లో, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దాంతో.. ఆ ఇద్దరు అగంతకులు బంగారు షాపులో దోపిడీకి యత్నించిన ఫుటేజీలలో క్లియర్‌గా రికార్డు అయ్యి ఉంది. వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారు బాగా తెలిసినవారేనా.. పాత నేరస్తులా.. కొత్తవారా.. అని ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా.. రద్దీగా.. నిత్యం వందల కోట్ల రూపాయిల బంగారు ఆభరణాల క్రయ, విక్రయాల లావాదేవీలు జరిగే ఆ ప్రాంతంలో సరైన పోలీసు గస్తీలు, ప్రైవేటు సెక్యూరిటీ లేకపోవడంతో.. తరచూ.. ఇటువంటి దోపిడీ.. చోరీ.. యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇకనైనా స్థానిక పోలీసుల గస్తీలు పెంచడం.. బంగారు వ్యాపారులు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటుచేసుకోవడం చేస్తే.. మేలని అంటున్నారంతా…