మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ఫాతిమా బేగం
ఫామాతి బేగంతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డ భక్తులు
వేనాడు దర్గాలో ఏఆర్ మోహమాన్ సోదరి
- మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ఫాతిమా బేగం
- ఫామాతి బేగంతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డ భక్తులు
తిరుపతి జిల్లా తడ మండలం వేనాడు గ్రామంలోని హజరత్ షేక్ దావూద్ షావలి దర్గా భక్తులతో కిటకిటలాడింది. కుల మతాలకతీతంగా అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం అమావాస్య సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సోదరి ఫాతిమా బేగం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హజ్రత్ షేక్ దావూద్ షావలి స్వామి సమాధులపై పూల గలేఫాలు కప్పి ప్రత్యేక పూజలతో అలంకరించి భక్తిని చాటుకున్నారు. అనంతరం మత పెద్దల ఆధ్వర్యంలో ఫాతిమా బేగం ప్రార్థనలు చేపట్టారు. ముందుగా దర్గాకు విచ్చేసిన ఏఆర్ రెహమాన్ సోదరి ఫాతిమా బేగం కు దర్గా నిర్వాహకులు ప్రత్యేక స్వాగతం పలికారు. ఆమెను పలకరించి ఫోటోలు దిగేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపారు.