ఓ విద్యార్థి అటెండెన్స్ విషయంలో గొడవ – రంగ ప్రవేశం చేసిన పోలీసులు
ఫిషరీ కళాశాల అసోసియేట్ డీన్ పై దాడి…
- ఓ విద్యార్థి అటెండెన్స్ విషయంలో గొడవ
- రంగ ప్రవేశం చేసిన పోలీసులు
ఓ విద్యార్థి అటెండెన్స్ విషయంలో ఫిషరీ కళాశాల అసోసియేట్ డీన్ పై రీ ఎంప్లాయిమెంట్ ప్రొఫెసర్ దాడికి పాల్పడ్డాడు. దీంతో అసోసియేట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆంద్రప్రదేశ్ ఫిషరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫిషరీ కళాశాల అసోసియేట్ డీన్ పై రీ ఎంప్లాయిమెంట్ ప్రొఫెసర్ దాడికి పాల్పడిన ఘటన… నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఫిషరీస్ యూనివర్శిటీలో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మేరకు… ఓ విద్యార్థి అటెండెన్స్ విషయంలో అసోసియేట్ డీన్ బాలసుబ్రమనియన్ పై రీ ఎంప్లాయిమెంట్ ప్రొఫెసర్ రామలింగయ్య మద్యం మత్తులో దాడి చేశాడు. దీంతో బాలసుబ్రమనియన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.