అధికారులకి వినతి పత్రం అందచేసిన సంగం మండల సచివాలయ ఉద్యోగులు
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి
- అధికారులకి వినతి పత్రం అందచేసిన సంగం మండల సచివాలయ ఉద్యోగులు
నెల్లూరు జిల్లా సంగం మండల సచివాలయం ఉద్యోగులు ఎంపీడీఓ షాలెట్,తహసీల్దార్ సోమ్లా నాయక్ లను కలిసి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారికి వినతిపత్రాలు అందజేశారు. తమకు స్పష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి..సర్వీస్ రూల్స్ అమలు చేసిన తరువాతనే బదిలీలు నిర్వహించాలని కోరారు.బదిలీల ప్రక్రియ సీనియారిటీ ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.సచివాలయ ఉద్యోగులను సొంత మండలాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రేషలైజేషన్ పూర్తైన తర్వాతనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో మండలంలోని అన్నీ శాఖల సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.