జ్యోతిష్యులు చెప్పారని

చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తారా

చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ హెచ్చరిక

నెల్లూరు జీజీహెచ్లోని వన్ స్టాఫ్ సెంటర్ తనిఖీ

జ్యోతిష్యులు చెప్పారని…

  • చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తారా
  • చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
  • రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ హెచ్చరిక
  • నెల్లూరు జీజీహెచ్లోని వన్ స్టాఫ్ సెంటర్ తనిఖీ


మూఢనమ్మకాలకు పోయి జ్యోతిష్యుల మాట విని పక్కింట్లోని సెల్ ఫోన్ ని చిన్నపాప దొంగిలించిందని అభూత కల్పనని సృష్టించి ఆ అమ్మాయిని చిత్రహింసలు గురి చేయడం దారుణమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ మండిపడ్డారు. నెల్లూరులోని ఆర్అండ్ డీ గెస్ట్ హౌస్ లో ఆమె మీడియాతో మాట్లాడారు.


మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. ఇటీవల ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో పది సంవత్సరముల బాలిక చెంచమ్మ పై అమానుషంగా వాతలు పెట్టడం జరిగింది. అలాగే కనుపర్తిపాడు వద్ద ఎనిమిది సంవత్సరాల బాలికపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన నిమిత్తం స్థానిక అపోలో హాస్పిటల్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. అదే విధంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ ను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ పి డి హే నా సుజనా మరియు శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *