చిన్నారిపై దాడి అమానుషం

ఎమ్మెల్యే సోమిరెడ్డి – అపోలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన ఎమ్మెల్యే

చిన్నారిపై దాడి అమానుషం

  • ఎమ్మెల్యే సోమిరెడ్డి
  • అపోలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన ఎమ్మెల్యే

ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారి చెంచమ్మపై వాతలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చెంచమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సెల్ ఫోన్ విషయంలో గరిటె కాల్చి ముఖం, కాళ్లు, చేతులపై వాతలు పెట్టడం దుర్మార్గమన్న సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. చెంచమ్మకు రూ.10 వేలు ఆర్థికసాయం చేశారు. చెంచమ్మపై అమానుషానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *