ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన ప్రజలు
కొడవలూరులో నీటి సమస్యకు పరిష్కారం…
- ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన ప్రజలు
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో కొడవలూరు మండలంలోని రెడ్డిపాలెం, మానేగుంటపాడులో ప్రజలకు నీటి సమస్య పరిష్కారం అయ్యింది. ఈ పంచాయతీల్లో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వెంటనే స్పందించిన ఆమె.. ఆయా గ్రామాల్లో కొత్త మోటార్లు ఏర్పాటు చేయించి నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దాంతో అధికారులు గ్రామానికి వెళ్లి బోర్లకు మరమ్మతులు చేయించారు. కొత్త మోటార్లు ఏర్పాటు చేయించారు. దాంతో ప్రజలకు నీటి సమస్య పరిష్కారం అయ్యింది. నీటి సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే వేమిరెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.