పుణ్యక్షేతంలో..ఛీ..ఛీ.. ఇవేం పనులు
ఆలయ ప్రాంగణంలోనే మద్యం సేవించడం, రాజగోపురం వద్దే మూత్ర విసర్జన చేస్తోన్న సెక్యూరిటీ గార్డ్స్ ఈవో సార్.. ఓ లుక్కేయండి.. బుద్ధి చెప్పండి వాళ్లకు
కాళహస్తీశ్వరా.. చూస్తున్నావా..?
పుణ్యక్షేతంలో..ఛీ..ఛీ.. ఇవేం పనులు
- ఆలయ ప్రాంగణంలోనే మద్యం సేవించడం..
రాజగోపురం వద్దే మూత్ర విసర్జన చేస్తోన్న సెక్యూరిటీ గార్డ్స్
ఈవో సార్.. ఓ లుక్కేయండి.. బుద్ధి చెప్పండి వాళ్లకు
దక్షిణ కాశీ మహా పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీకాళహస్తి దేవస్థానంలో గత కొంత కాలంగా అపశృతి దొర్లుతోంది. అక్కడ పనిచేసే ఉన్నతాధికారి నుంచి.. కింది స్థాయి సిబ్బంది వరకు ఎంతో పవిత్రంగా.. భక్తి శ్రద్ధలతో విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ.. కొందరు ఉద్యోగ, సిబ్బంది వ్యవహారం ఆ పుణ్యక్షేత్రానికి అపకీర్తి తెస్తున్నారు. ఆలయం ఆవరణంలో మద్యం సేవించడం.. ఆ మత్తులో..అక్కడే మల మూత్రాదులకు వెళ్లడం.. భక్తులకు అసౌకర్యం కలగజేస్తోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే సెక్యూరిటీ సిబ్బంది రాత్రి వేళలల్లో ఇటువంటి చర్యలకు పాల్పడుతుండటం.. ఎన్-3 నిఘాకి చిక్కారు. వారి తీరువల్ల సందర్శకులు, భక్తులు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ ఈవో ఈవిషయమై ప్రత్యేక దృష్టిపెట్టి.. విచారించి.. తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.