విధులకు అనుమతించకుండా వేధిస్తున్నారు
నెల్లూరు కలెక్టరేట్లో దాచూరు వీవోఏ శిరీష ఆవేదన
హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చినా….
- విధులకు అనుమతించకుండా వేధిస్తున్నారు
- నెల్లూరు కలెక్టరేట్లో దాచూరు వీవోఏ శిరీష ఆవేదన
తనను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చినా…విధుల్లోకి అనుమతించకుండా అధికారులు వేధిస్తున్నారని నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు వీవోఏ శిరీషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తనకు న్యాయం చేయాలంటూ… నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ ని కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా శిరీషా మీడియాతో మాట్లాడారు. కలువాయి వెలుగు అధికారులు హైకోర్టు ఉత్తర్వుల్ని సైతం ధిక్కరించడంతోపాటు…అనధికారికంగా వేరేవాళ్లని విధుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. వెంటనే కలెక్టర్ విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.