అక్కడి జగనన్న కాలనీలో మోటార్లు తీసుకెళ్తూ సుధీర్ బైక్‌ను ఢీకొట్టిన టాటా మ్యాజిక్
దాంతోనే సుధీర్ మృతి – మోటారు దొంగలను కాపాడేందుకు రంగంలోకి దిగిన నేతలు
లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సుధీర్ మృతికి మోటారు దొంగలే కారణం
-అక్కడి జగనన్న కాలనీలో మోటార్లు తీసుకెళ్తూ సుధీర్ బైక్‌ను ఢీకొట్టిన టాటా మ్యాజిక్
- దాంతోనే సుధీర్ మృతి
- మోటారు దొంగలను కాపాడేందుకు రంగంలోకి దిగిన నేతలు
- లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నెల్లూరు జిల్లా కోవూరు మండలం.. జమ్మిపాళెంలో మలపాటి సుధీర్ బాబు మరణం వెనుక అనేక కోణాలు దాగి ఉన్నాయి. అది అనుమానాస్పద మృతిగా దర్యాప్తు జరుగుతున్నా.. అతడు మరణానికి మాత్రం కారణం.. మోటారు దొంగలేనన్నది నగ్న సత్యం. ఎందుకంటే.. సుమారు అర్థరాత్రి సమయంలో.. అక్కడి జగనన్న లేఅవుట్‌లో నుంచి మోటార్లను టాటా మ్యాజిక్ వాహనంలో తీసుకెళ్తుండటం.. అదే సమయంలో జమ్మిపాళెంకు చెందిన కొందరు యువకులు వార్ని మందలించడం.. ప్రశ్నించడంతో.. మోటార్లు, పైపులను తీసుకెళ్తూ.. అతి వేగంగా వెళ్తూ.. ఎదురుగా వస్తున్న సుధీర్‌ను ఢీకొట్టడంతో.. ముఖంపై.. తలవెనుక బలమైన గాయాలు తగలడంతో.. అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. సుధీర్ మృతికి అసలు కారణం మోటార్ల దొంగలు. వారు ఆ సమయంలో మోటార్లు తరలించాల్సిన అంత అవసరం ఏంటి..? స్థానికులు ప్రశ్నిస్తే.. మ పొలంలోని మోటార్లు తీసుకెళ్తున్నామని.. పట్టుబడ్డ ఆ టాటా మ్యాజిక్ వాహనం డ్రైవర్ చెప్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మరో ముగ్గరు యువకులు కూడా ఆ వాహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. వారెవరు..? ఎక్కడివారు..? ఎవరి తాలూకా..? వీరిని తప్పించేందుకు ఈ వ్యవహారాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాజకీయ నాయకులు కూడా రంగ ప్రవేశం చేసినట్లు సమాచారం. పోలీసులపై ఒత్తిడి తెచ్చే యత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ మోటారు దొంగలు టీడీపీలోని ఓ కీలక నాయకుడి తాలూకాగా ఆరోపణలు వస్తున్నాయి. కోవూరు నియోజకవర్గం.. రూరల్, నెల్లూరు పరిధిలో గతంలో జరిగిన అనేక మోటార్ల చోరీ చేసులను తిరగతోడితే.. వీరి బండారం బయటపడుతుందని అంటున్నారు. అయితే.. ఘటనతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై రంగనాథ్ గౌడ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. వస్తున్న ఆరోపణలు, విమర్శలు, విభిన్న కథనాలను నిగ్గుతేల్చి.. అసలు మోటారు దొంగలపై దృష్ఠిపెట్టారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రమాదానికి కారణమైన టాటా మ్యాజిక్ వెహికల్ డ్రైవర్‌ను విచారిస్తున్నారు.