క్యాడర్ తక్కువ.. కొరఢా ఎక్కువ
బుచ్చిలో సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన
జీవో 5ను సవరించాలని డిమాండ్
మా మెడపై కత్తి ఎందుకయ్యా..
- క్యాడర్ తక్కువ.. కొరఢా ఎక్కువ
- బుచ్చిలో సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన
- జీవో 5ను సవరించాలని డిమాండ్
బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సచివాలయ సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. జీవో నెం. 5ని సవరించాలని డిమాండ్ చేశారు.
జీవో నెం 5ని సవరణ చేయాలని కోరుతూ సచివాలయ సర్వేయర్లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దారు కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు… ప్ల కార్డులతో నినాదాలు చేశారు. ప్రభుత్వం అనేక సర్వేలతో పని ఒత్తిడి పెంచి వేధిస్తుందనీ తెలిపారు.. బదిలీ ప్రక్రియలో సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని జీవను సవరించాలని విజ్ఞప్తి చేశారు..ఆరేళ్లుగా సచివాలయ సర్వేయర్లకు ఎలాంటి పదోన్నతులు లేవని తెలిపారు…ప్రమోషన్స్ కల్పించాకే బదిలీల ప్రక్రియ చేపట్టాలనీ డిమాండ్ చేశారు.. సర్వేయర్లు.. దివిజ,భవ్య, హరిత, గుణవతి,హనీష్, ప్రకాష్, శ్రీను, ఏడుకొండలు, కిరణ్, పలువురు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు..