నెల్లూరు కలెక్టరేట్లో వినతులు స్వీకరించిన జేసీ కార్తిక్
వినతులు రిపీట్ కాకుండా చూడాలని అధికారులకి ఆదేశం
బారులు తీరిన అర్జీదారులు…
- నెల్లూరు కలెక్టరేట్లో వినతులు స్వీకరించిన జేసీ కార్తిక్
- వినతులు రిపీట్ కాకుండా చూడాలని అధికారులకి ఆదేశం
నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులకి త్వరిగతిన న్యాయం చేయాలని జేసీ అధికారుల్ని ఆదేశించారు.
నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కార్తిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డీఆర్వో ఉదయభాస్కర్, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, జిల్లా సర్వే అధికారి నాగశేఖర్ లతో కలసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ కి జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపైన వచ్చిన అర్జీదారులతో తిక్కన ప్రాంగణం కిటకిటలాడింది. గ్రీవెన్స్ కి వచ్చే ప్రతీ అర్జీని క్షుణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని జేసీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు రిపీట్ కాకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు.