ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగూరు
తొలి అడుగు సమావేశం
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగూరు
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సుపరిపాలనలో తొలి అడుగు సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. అందుకోసం అమరావతిలోని సెక్రటేరియట్ వెనుకాల సమావేశం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆయా ఏర్పాట్లను కొద్ది సేపటి క్రితం మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానుండటంతో.. ఎక్కడా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఆదేశించారు. గత ఏడాదిలో సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ప్రజలకు వివరించనునంది.