కన్జుమర్లకు ధరలు పెంచేయడం అన్యాయం
వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి
నెల్లూరు కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్
కేబుల్ ఆపరేటర్ల పొట్టకొట్టద్దు…
- కన్జుమర్లకు ధరలు పెంచేయడం అన్యాయం
- వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి
- నెల్లూరు కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్
బ్రాడ్ కాస్టర్ల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని…కన్జుమర్లకు ధరలు పెంచడం దారుణమని.. నెల్లూరు కేబుల్ టీవీ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ జాయిం సెక్రటరీ కనగలూరు రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలంటూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరేటర్లు నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా రమణయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మల్లికార్జున, వాసు, సిద్ధయ్య, సాయి, నెల్లూరులోని కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.