మృతుని బంధువుల ఆరోపణలే నిజమా…?
అధికారుల నిర్ధారణే వాస్తవమా…?
సీసీ పుటేజీ పరిశీలిస్తేనే…మిస్టరీ వీడేది
ఆ..సీసీ కెమెరానే కీలకం
- మృతుని బంధువుల ఆరోపణలే నిజమా…?
- అధికారుల నిర్ధారణే వాస్తవమా…?
- సీసీ పుటేజీ పరిశీలిస్తేనే…మిస్టరీ వీడేది
నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మిపాళెంలో నిన్నరాత్రి జరిగిన ఘటన మిస్టరీగా మారింది. మృతుని బంధువుల ఆరోపణలు ఓ వైపు… పోలీసుల అధికారుల విచారణ మరో వైపు సాగుతుండగానే…మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యి అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ ఈ ఘటన తాలుకా మిస్టరీ మాత్రం వీడడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఘటనా స్థలంలోని సీసీ కెమెరానే కీలక ఆధారంగా మారింది. ఈ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో పుటేజ్ చూస్తే దాదాపుగా జమ్మిపాళెంలో జరిగింది హత్యా…లేక ప్రమాదమా అనేది తేటతెల్లకానుంది. ఎవరు వాదనలు ఎలా ఉన్నా…మూడో నేత్రమైన సీసీ కెమెరానే ఈ మొత్తం ఘటనకి ఏకైక సాక్ష్యంగా నిలవనుంది. ఏది ఏమైనా సుధీర్ బాబు మృతితో జమ్మిపాళెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం పక్కన పెట్టుకొని మృతుని బంధువులు చేస్తోన్న రోధనలు అందరిని కలచి వేయగా…వారు వ్యక్తం చేస్తోన్న అనుమానాలు అక్కడకి వచ్చిన వారిలో కూడా చర్చనీయాంశంగా మారాయి.