జగన్ కాన్వే ప్రమాదంపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్
శ్రీకాళహస్తిలో పర్యటించిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఆ వీడియో ఫేక్ కాదు…నిజమే
- జగన్ కాన్వే ప్రమాదంపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్
- శ్రీకాళహస్తిలో పర్యటించిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా…పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ…మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ దత్తపుత్రుడేనని విమర్శించారు. టీడీపీ, జనసేన పార్టీలు కూడా కేంద్రంలో కలిసిపోయాయంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై ఇంత వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. మొన్న జగన్ పర్యటనలో జరిగిన ప్రమాదంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అది ఫేక్ కాదని, నిజమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసమే పోరాడుతూ ఉంటుందన్నారు.