కాదు.. ప్రమాదం.. -వ్యాను బైక్ ఢీ.. యువకుడు మృతి
కోవూరు జమ్మిపాళెం వద్ద జరిగిన ఘటనపై భిన్న వాదనలు
హత్యేనంటున్న కుటుంబ సభ్యులు, స్థానికులు
అది హత్యే..!
కాదు.. ప్రమాదం..
వ్యాను బైక్ ఢీ.. యువకుడు మృతి
కోవూరు జమ్మిపాళెం వద్ద జరిగిన ఘటనపై భిన్న వాదనలు
హత్యేనంటున్న కుటుంబ సభ్యులు, స్థానికులు
కోవూరు మండలం జమ్మిపాలెం రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి నెల్లూరు నుంచి బైక్ పై వస్తున్న జమ్మిపాలెం అరుంధతివాడకు చెందిన మలపాటి సుధీర్ బాబు ను అదే రూట్ లో వస్తున్న టాటా ఏసీ వాహనం బలంగా ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి ఎగిరి రోడ్డు మీద పడగా సుధీర్ తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన ఆ వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి.. మృతదేహాన్ని పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటన ప్రమాదం కాదని.. కావాలనే హత్య చేశారంటూ..సుధీర్ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల నుంచి కూడా పోలీసులు వివరాలు సేకరించారు. తల్లి, భార్య, స్థానికులంతా మోటార్ల దొంగలే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ మృతితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సుధీర్ నెల్లూరులోని సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో సేల్స్‌లో పనిచేస్తుంటాడు. రాత్రి విధులు పూర్తిచేసుకుని.. తిరిగి ఇంటికి వెళ్తుండగా అనుమానాస్పద స్థితిలో అతడు మృతిచెందాడు. ఈసందర్భంగా ఎస్సై రంగనాథ్ గౌడ్ మాట్లాడారు. ఆయా వివరాలు వెళ్లడించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెళ్లడించారు.