అంగన్వాడీలకు తల్లికి వందనం అమలు చేయాలి

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా

అంగన్వాడీలకు తల్లికి వందనం అమలు చేయాలి

  • నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా


నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల మహా ధర్నా చేపట్టారు. అంగన్వాడీలందరికి తల్లికి వందనం పథకం అమలు చేయడంతోపాటు…ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


మా అందరికి కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలని…అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని…ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తమకూ అమలు చేయాలని నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుజాతమ్మ, కార్యదర్శి షేక్ రెహనాబేగంలు మీడియాతో మాట్లాడారు. సాధిక సర్వేలో అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగం అనే పదం తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చాలీ చాలని జీవితాలతో కుటుంబాలను పోషిస్తున్న అంగన్వాడీలందరికి రేషన్ కార్డుల, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాళ్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *