మంత్రి నారాయణ – అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి – వి ఆర్ హైస్కూల్లో ఆధునీకరించిన పనుల పట్ల సంతృప్తి
వీఆర్సీ స్కూల్ అభివృద్ధి నా కనీస బాధ్యత…
- మంత్రి నారాయణ
- అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి
- వి ఆర్ హైస్కూల్లో ఆధునీకరించిన పనుల పట్ల సంతృప్తి
పేద, నిరుపేద విద్యార్థుల కోసమే వీఆర్ హైస్కూల్ ని అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు వి ఆర్ హై స్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లతో కలసి మంత్రి నారాయణ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా ప్రవేశపెట్టిన పి – 4 పద్ధతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో అతి పేద విద్యార్థులను గుర్తించి ప్రవేశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి ,డివిజన్ ప్రెసిడెంట్ ,క్లస్టర్ ఇంచార్జ్ ,టీడీపీ నేతలు ,కార్పొరేషన్ ఇంజినీర్లు పాల్గొన్నారు .