రుజువు చేయండి…ఇచ్చేస్తా

నా దగ్గర అన్నీ ఆధారాలు పక్కాగా ఉన్నాయి

28 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా…ఒక్క మచ్చ లేదు

కావాలనే నాపై కుట్ర – మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

రుజువు చేయండి…ఇచ్చేస్తా

  • నా దగ్గర అన్నీ ఆధారాలు పక్కాగా ఉన్నాయి
  • 28 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా…ఒక్క మచ్చ లేదు
  • కావాలనే నాపై కుట్ర
  • మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

అహోబిలం మఠంకు చెందిన స్థలంలో నాటిన బోర్డులను దౌర్జన్యం చేసి తొలగించారని నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మేనల్లుడు నాగేందర్ రెడ్డి పై నెల్లూరు రూరల్ కి చెందిన వీఆర్వో వెంకటరమణయ్య అహోబిలం మతానికి చెందిన పలువురు పంతుళ్ళు గురువారం సాయంత్రం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. నెల్లూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆ స్థలం తమదేనని, నా దగ్గర పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని తేల్చి చెప్పారు. తనది కాదని రుజువు చేస్తే….ఆ భూమిని ఇచ్చేస్తామని సవాల్ విసిరారు. నేను 28 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని…ఇప్పటి వరకు ఒక్క మచ్చ కూడా లేదన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కావాలనే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. తాహసిల్దార్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అన్నారు. దీనిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని చెప్పారు. నాకు కనుపర్తిపాడుతో పాటు అనేక ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయన్నారు. ఆదాల ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *