అల్లూరులో ఆగని చోరీలు – అంజయ్య నాయుడు కాలనీలో 24 గంటల్లోనే మరో చోరీ
పోలీసులు ఉన్నట్లా.. లేనట్లా..? గస్తీలు ఏమయ్యాయి..?
రెండు నెలల్లో 8 చోరీలు.. హడలిపోతున్న ప్రజలు
పోలీసులకు చీమ కుట్టినట్టు కూడా లేదా..?
అల్లూరులో ఆగని చోరీలు
అంజయ్య నాయుడు కాలనీలో 24 గంటల్లోనే మరో చోరీ
పోలీసులు ఉన్నట్లా.. లేనట్లా..? గస్తీలు ఏమయ్యాయి..?
రెండు నెలల్లో 8 చోరీలు.. హడలిపోతున్న ప్రజలు
నెల్లూరు జిల్లా.. అల్లూరు లో పోలీసులున్నారా..? విధులు నిర్వర్తిస్తున్నారా..? గస్తీలు కాస్తున్నారా..? నిఘా పెడుతున్నారా..? వైట్ కాలర్ నేరాలు అటుంచితే.. వరుస చోరీలు, నేరాలు జరుగుతూ.. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంటే.. ఏం చేస్తున్నారు..? దొంగలే.. పట్టుకోండి చూద్దాం అంటూ.. సవాల్ విసిరి మరీ చోరీలు చేస్తుంటే.. పోలీసులకు చీమ కుట్టినట్లు కూడా లేదా..? ఔనులే.. వాళ్ల ఇళ్లల్లో కాదుకదా.. దొంగలు పడేది.. వాళ్ల సొత్తు కాదు కదా.. దోచుకెళ్లేది.. ఇక.. వాళ్లకెందుకు నొప్పి ఉంటుంది.. వాళ్లకెందుకు బాధ ఉంటుంది.. గత రెండు నెలల కాలంలో ఒకే పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలు జరుగుతుంటే.. ఆ పోలీసులున్నట్లా..? లేనట్లా..? జిల్లా పోలీసులు ఏం చేస్తున్నారు..? ఎందుకు ఆ స్టేషన్ అధికారులు, సిబ్బందిపై దృష్టిపెట్టడంలేదు..? అనే అనుమానాలు ఎవరికైనా రాకమానదు. ఈ చోరీల వెనుక ఎవరునున్నారు..? ఒకవేళ పోలీసులే చేయిస్తున్నారా..? అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే.. గత 24 గంటల ముందు అల్లూరులోని అంజయ్య నాయుడు కాలనీలో జరిగిన చోరీ ఘటన మరువకముందే.. అదే కాలనీలో కొండూరు ఉమా అనే మహిళ ఇంటిలో దొంగలు పడి 13 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. ఈ వరుస నేరాలకు పాల్పడేది పాత నేరస్తులా.. కొత్తవారా..? సంఘటనా స్థలంలో లభించే వేలిముద్రలు, ఇతర ఆధారాలతో ఎందుకు వారిని పట్టుకోలేకున్నారు..? అనే సందేహాలు వస్తున్నాయి. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఈ స్టేషన్ను ప్రత్యేకంగా పరిశీలించి.. అక్కడి సిబ్బంది పనితీరుపై నిఘా పెట్టకపోతే.. ఈ చోరీలు.. నేరాలు మాత్రం ఆగవని అంటున్నారంతా..