47వ డివిజన్లో రూ.15లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ
స్థానికుల ఆదరణ చూసి ఉబ్బుబ్బిపోయిన మంత్రి
నెల రోజుల్లో రోడ్డును ప్రారంభిస్తా
47వ డివిజన్లో రూ.15లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ
స్థానికుల ఆదరణ చూసి ఉబ్బుబ్బిపోయిన మంత్రి
నెల్లూరు నగరం.. 47వ డివిజన్.. ములిముడి బస్టాండ్ సెంటర్ లో 15 లక్షలతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్‌ఛార్జి ధర్మవరం గణేష్, సీనియర్ నాయకులు ధర్మవరం సుబ్బారావుల ఆధ్వర్యంలో.. పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీగా బాణాసంచా పేల్చారు. మహిళలు మంత్రికి మంగళహారతులు పట్టారు. అనంతరం నారాయణ సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. మాట్లాడారు. నెల రోజుల్లో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కమిషనర్‌కు, కాంట్రాక్టర్ అమృల్లాకు ఆదేశించారు. వచ్చే నెల ఆదే రోజున వచ్చి ఈ రోడ్డును తాను ప్రారంభిస్తానన్నారు. స్థానికుల నుంచి లభించిన ఆదరణకు తాను ఉబ్బితబ్బి అయ్యానని.. తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో.. కార్పొరేషన్ కమీషనర్ నందన్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ , ,టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ,డివిజన్ ఇంచార్జి ధర్మవరం గణేష్ ,47 వ డివిజన్ కార్పొరేటర్ రామక్రిష్ణ ,టీడీపీ నేతలు ,అభిమానులు పాల్గొన్నారు .