గరిటెతో ఒళ్లంతా వాతలు పెట్టిన రాక్షసులు

ఇందుకూరుపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఘటన

గరిటెతో ఒళ్లంతా వాతలు పెట్టిన రాక్షసులు

  • ఇందుకూరుపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఘటన


నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం కాకర్ల దిబ్బలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలించిందే కారణంగా పదేళ్ల గిరిజన బాలికపై కొందరు వ్యక్తులు స్టీల్ గరిటె కాల్చి ముఖం, శరీరంపై విచక్షణా రహితంగా వాతలు గాయపరిచారు.

సెల్ ఫోన్ దొంగలించిందని కారణంతో పదేళ్ల గిరిజన బాలికపై ఐదుగురు వ్యక్తులు కాల్చిన స్టీల్ గరిటతో …శరీరంపై విచక్షణారహితంగా వాతలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెుం కాకర్ల దిబ్బలో చెంచమ్మ అనే పదేళ్ల గిరిజన బాలికపై సొంతం తన బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టారు. కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు బాలికకు దూరంగా ఉండడంతో ఆ బాలిక ఆలనా పాలన ఆ గిరిజన కాలనీలో కొందరు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో సెల్ ఫోన్ పోవడం ఆ సెల్ ఫోన్ ను ఆ బాలిక దొంగలించినట్లు గుర్తించిన బాలిక బంధువులు ఆ చిన్నారిపై కాల్చిన స్టీల్ గరిటతో ఒళ్లంతా వాతలు పెట్టారు. చివరికి ముఖం మీద కూడా విచక్షణా రహితంగా కాల్చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. ఘటనకు కారకులైన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై విరవణ కోరగా ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చే వరకు వివరాలు వెల్లడించలేమని ఇందుకూరుపేట పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *