నెల్లూరు రూరల్ అభివృద్ధికి మంత్రి నారాయణ పూర్తి సహకారం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
30,37,38 డివిజన్లలో పార్కులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే
29 పార్కులు…రూ. 7 కోట్లు
- నెల్లూరు రూరల్ అభివృద్ధికి మంత్రి నారాయణ పూర్తి సహకారం
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
- 30,37,38 డివిజన్లలో పార్కులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే
యాంకర్ పార్ట్ :
రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి నిర్వహించారు. స్థానిక ప్రజలతో కలసి ఆయన పార్కులకి శంఖుస్థాపన చేశారు.
వాయిస్ వోవర్ :
నెల్లూరు నగర నియోజకవర్గమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నారాయణ పూర్తి సహకారం అందిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30, 37,38 డివిజన్ లలో పార్కులకు శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఎమ్మెల్యేకి ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, స్థానిక ప్రజలతో కలసి పార్కులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ….అందరి సహకారంతో నెల్లూరు రూరల్ ను పటిష్టంగా తయారు చేస్తున్నామని చెప్పారు. పార్కులను అభివృద్ధి మాత్రమే చేస్తామని పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.