నెల్లూరు కేంద్ర కారాగారంలో కాకాణితో ఆదాల ములాఖత్
అండగా ఉంటాం అధైర్యపడకండి
-నెల్లూరు కేంద్ర కారాగారంలో కాకాణితో ఆదాల ములాఖత్
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న కాకాణి గోవర్థన్‌రెడ్డితో ములాఖత్ అయ్యి.. పరామర్శించారు. పలు విషయాలు, అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. కాకాణికి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ధైర్యం చెప్పారు. పార్టీతోపాటు జిల్లా నేతలంతా మీకు, మీ కుటుంబానికి అండగా ఉంటామని.. మీరు అధైర్యపడొద్దంటూ భరోసా ఇచ్చారు. ఆదాల తోపాటు వైసీపీ సీనియర్ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, హరిబాబు యాదవ్, పాశం శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు.