ప్రజల భాగస్వామ్యంతో పార్కులు అభివృద్ధి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
21,22,23 డివిజన్లలో పార్కులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే
150 కోట్లు విలువ చేసే స్థలాలను కాపాడాం
- ప్రజల భాగస్వామ్యంతో పార్కులు అభివృద్ధి
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- 21,22,23 డివిజన్లలో పార్కులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పార్కులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. పార్కులను అభివృద్ధి మాత్రమే చేస్తామని… పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలదేనని ఆయన చెప్పారు.
150 కోట్లు విలువ చేసే స్థలాలను భావితరాలకు, ప్రజలకు చెందే విధంగా కాపాడామని… రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21, 22, 23 డివిజన్ లలో పార్కులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేశారు. శ్రీధర్ రెడ్డికి డివిజన్ల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో కలసి పార్కులకు శంఖుస్థాపనలు చేశారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ….పార్కులను అభివృద్ధి మాత్రమే చేస్తామని… పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీ, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.