సూపర్ సిక్స్ పథకాలు అమలు
వైసీపీ పుస్తకావిష్కరణను తీవ్రంగా ఖండించిన ఆత్మకూరు టీడీపీ నాయకులు
రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా…
- సూపర్ సిక్స్ పథకాలు అమలు
- వైసీపీ పుస్తకావిష్కరణను తీవ్రంగా ఖండించిన ఆత్మకూరు టీడీపీ నాయకులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిష్కరించిన పుస్తకాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుస్తక ఆవిష్కరణ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు తగవని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వారు పేర్కొన్నారు.రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని అన్నారు. గత వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టించారని వారు విమర్శించారు. గత ప్రభుత్వం లో ఇసుక, గ్రావెల్,మద్యం మాఫియా పేట్రేగిపోయాయని అన్నారు. వైసీపీ నాయకులు తమ ప్రభుత్వంలో ఏం చేశారనేది గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరమణమ్మ ,ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, టిడిపి రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజా రెడ్డి,రూరల్ అధ్యక్షులు పెంచల చౌదరి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.