రవాణా, వసతులు, ఏర్పాట్లపై సుదీర్ఘ చర్చ
యోగాంధ్రపై మంత్రి నారాయణ వరుస సమీక్షలు…
- రవాణా, వసతులు, ఏర్పాట్లపై సుదీర్ఘ చర్చ
యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రవాణా కమిటీ సభ్యులతో విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మందికి అవసరమైన రవాణా ఏర్పాట్లు, బస్సులు, ప్రయివేట్ వాహనాల్లో వచ్చే వారికీ ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి చర్చించారు. పార్కింగ్,ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాలు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలనీ రవాణా కమిటీ సభ్యులకు సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ ఆదేశించారు.