యోగాంధ్రను విజయవంతం చేద్దాం

యోగాంధ్రపై టీడీపీ కార్యాలయంలో మంత్రుల సమీక్ష

యోగాంధ్రను విజయవంతం చేద్దాం…

  • యోగాంధ్రపై టీడీపీ కార్యాలయంలో మంత్రుల సమీక్ష


యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం, ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు.


యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంపై విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, బాల వీరాంజనేయ స్వామి,అనిత,అనగాని,సత్యకుమార్,పార్థసారథి, సవిత,బీసీ జనార్దన్ రెడ్డిలు హాజరయ్యారు. యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా తీసుకోవాల్సిన చర్యలు, తెల్లవారుజామున జరిగే కార్యక్రమం కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే వారికోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రులు చర్చించారు. జనసమీకరణ,రవాణా,ఇతర సౌకర్యాలపై ప్రజాప్రతినిధులు, కూటమి నేతలకు వారు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ…ప్రధాని హాజరయ్యే కార్యక్రమం కావడంతో భద్రతా రీత్యా ఉదయం 5.30 తర్వాత ఎవరినీ అనుమతించరన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతుల కల్పిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *