నాన్న భాద్యత నేను తీసుకున్న

ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా అందుబాటులో ఉంటా

భాస్కర్ రెడ్డిని పరామర్శించిన కాకాణి పూజిత

నాన్న భాద్యత నేను తీసుకున్న

  • ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా అందుబాటులో ఉంటా
  • భాస్కర్ రెడ్డిని పరామర్శించిన కాకాణి పూజిత


నియోజకవర్గంలో ఎవరికీ ఇబ్బంది ఉన్నా తాము తోడుగా ఉంటానని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్త్ కాకాణి పూజత భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ నేత దువ్వూరు విజయ భాస్కర్ రెడ్డి ఆమె పరామర్శించారు.


తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భాద్యత తాను తీసుకుని అందరి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నానని…. కాకాణి పూజిత పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం… దువ్వూరువారిపాలెం కి పూజిత విచ్చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయుకుడు దువ్వూరు విజయ భాస్కర్ రెడ్డి ఆనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో….ఎంపీపీ గండవరం సుగుణ, పెన్నా డెల్టా మాజీ చైర్మన్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి తదితరులతో కలిసి భాస్కర్ రెడ్డిని ఆమె పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ….నియోజకవర్గంలో ఎవరికీ ఇబ్బంది ఉన్నా తాము తోడుగా ఉంటామని చెప్పారు. ఇటువంటి సమయంలో తమవెంట ఇంతమంది నడచిరావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసీ బందెల వెంకటసుబ్బయ్య, సర్పంచ్ లు అలపాక శ్రీనివాసులు, అన్నాబత్తిన కృష్ణవేణి, కాకి మస్తానమ్మ, పల్లికొండ ప్రతాప్, అగ్ని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *