కావలి ఏరియా వైద్యశాలలో వైద్య శాఖ డైరెక్టరేట్ విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ
వైద్యులు సిబ్బంది నర్సులు వారీగా స్టేట్మెంట్లు రికార్డు
విచారణ నివేదికను ప్రభుత్వానికి తెలియజేస్తామన్న విజిలెన్స్ అధికారులు
ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలు
- కావలి ఏరియా వైద్యశాలలో వైద్య శాఖ డైరెక్టరేట్ విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ
- వైద్యులు సిబ్బంది నర్సులు వారీగా స్టేట్మెంట్లు రికార్డు
- విచారణ నివేదికను ప్రభుత్వానికి తెలియజేస్తామన్న విజిలెన్స్ అధికారులు
కావలి ఏరియా వైద్యశాలలో వైద్యశాఖ డైరెక్టరేట్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలపైనా తారా తీశారు. వారు తనిఖీలు చేస్తున్న సమయంలో మీడియా కూడా లోపలకు అనుమతించలేదు.
నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాలలో విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపాయి. వైద్యశాఖ విజిలెన్స్ అధికారి బీసీకే నాయక్ ఆధ్వర్యంలో ఆస్పత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలపైనా తారా తీశారు. వారు తనిఖీలు చేస్తున్న సమయంలో మీడియా కూడా లోపలకు అనుమతించలేదు. అనంతరం వైద్య సిబ్బంది నర్సులను వైద్యులను వేరువేరుగా లోపలకు పిలిచి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి నాయక్ మాట్లాడుతూ తాము సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఇతనికేల్లో విజిలెన్స్ అధికారులు ఎం. మజీద్ బి, వై. సురేష్ చంద్, కె. భార్గవ, రంగనాయకులు పాల్గొన్నారు. ఆసుపత్రికి వైద్యులు సక్రమంగా రాకపోవడం ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం తదితర అంశాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది.