ఎవరైనా సరే తాటతీస్తాం

జగన్ పై సోమిరెడ్డి ఫైర్

నర్రవాడ వెంగమాంబ పేరాంటాల బ్రహ్మోత్సవాల్లో

ఎమ్మెల్యేలు కాకర్ల, సోమిరెడ్డి – అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఎవరైనా సరే తాటతీస్తాం…

  • జగన్ పై సోమిరెడ్డి ఫైర్
  • నర్రవాడ వెంగమాంబ పేరాంటాల బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యేలు కాకర్ల, సోమిరెడ్డి
  • అమ్మవారికి ప్రత్యేక పూజలు


వెంగమాంబ పేరంటాలు అమ్మవారిని ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్ లు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.


నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకి స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన స్వాగతం పలికారు. కాకర్లతో కలసి సోమిరెడ్డి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా సత్తేనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో జరిగిన వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా మృతిచెందిన నాగేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి, అతని రౌడీ మూకలు నిన్న చేసిన అరాచకం అంత ఇంత కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను చూసి ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే తాటతీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *