రైతులకి పంటలసాగు, నీటి యాజమాన్య పద్దతులపై సూచనలు
గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి రైతులకు సిసిఆర్సి కార్డులు ఇస్తామని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. సంగంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకి పలు సూచనలు, సలహాలు చేశారు.
నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడు గ్రామంలోని పంచాయితీ కార్యాలయంలో వ్యవసాయాధికారి శశిధర్ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయాధికారిని సత్యవాణి పాల్గొన్నారు. రైతులకు పంటల సాగు, నీటి యాజమాన్య పద్ధతుల గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లాలో రైతులు 3 లక్షల ఎకరాలలో వరి సాగు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకు అవసరమైన ఎరువులు సిద్ధం చేస్తున్నామని ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలియజేశారు. గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి రైతులకు సిసిఆర్సి కార్డులు ఇస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటికే 3 లక్షల 99 వేల రికార్డులు ప్యూరిఫికేషన్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాజున్నీస్, సంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు,వ్యవసాయ శాఖ ఏ డి ఏ లు నర్సోజి, అనిత,వ్యవసాయాధికారి శశిధర్,వ్యవసాయ విస్తరణాధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.