కోర్ట్ ని ప్రారంభించిన మత్స్యకార నాయకులు
రామచంద్రాపురంలో వాలీబాల్ కోర్ట్…
- కోర్ట్ ని ప్రారంభించిన మత్స్యకార నాయకులు
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామచంద్రపురం గ్రామంలో వాలీబాల్ కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మత్స్యకార నాయకులు ఆవుల వాసు విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన వాసుకి గ్రామస్తులు ఘన స్వార్థం పలికారు. అమ్మవారిని దర్శించుకుని అనంతరం ఆయన వాలీబాల్ కోర్ట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో నేడు రామచంద్రపురం గ్రామంలో వాలీబాల్ కోర్టును ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మత్స్యకార గ్రామాల్లో యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని… మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి యువతకు క్రీడా ప్రాంగణాలను, ఆట వస్తువులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి యువత క్రీడలు పట్ల ఉత్సాహంగా ఉండి ముందుకు సాగాలన్నారు. ఇలాంటి వారి కోసం తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.