వెంకటగిరి ఆసుపత్రికి తరలింపు
ముగ్గురిపై రెండు ఎలుగుబంట్లు దాడి…
- వెంకటగిరి ఆసుపత్రికి తరలింపు
ముగ్గురు వ్యక్తులపై రెండు ఎలుగుబంట్లు దాడి చేశాయి. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం మొక్కలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వెలుగొండ అటవీ ప్రాంతంలో కలప కోసం వెళ్లారు. వీరిపై రెండు ఎలుగుబంట్లు ఒక్క సారిగా దాడి చేశాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఎలుగుబంట్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ అంకయ్యను సుమారు 10 కిలోమీటర్ల వరకు అడవిలో జోలికట్టి గ్రామస్తులు మోసుకొచ్చారు. తీవ్ర గాయాలైన అంకయ్యను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. మిగిలిన ఇద్దరి కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, వైద్యులు మాట్లాడారు.