ఏడాదిలో కూటమి పాలన సూపర్ సక్సెస్
ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్
ప్రతిపక్షాల విమర్శలకు చంద్రబాబు ధీటైన సమాధానం
- ఏడాదిలో కూటమి పాలన సూపర్ సక్సెస్
- ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్
గడిచిన ఏడాదిలోనే సంక్షేమం, అభివృద్ధి పథకాలను రెండు అమలు చేసి ప్రతిపక్షాల విమర్శలకు సీఎం చంద్రబాబు ధీటైన సమాధానం చెప్పారని ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ తెలిపారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్ ఎస్ మాట్లాడుతూ… బీసీలపై దాడులు చేయాలంటే వణుకు పుట్టేలా బీసీ రక్షణ చట్టం విధివిధానాలను కూటమి ప్రభుత్వం రూపుదిద్దుతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన బీసీ లకు స్వర్ణయుగం అని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ త్వరలోనే పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.