నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌న‌లం రేపే క‌థ‌నాలు

అప్పు చెల్లించలేదని చెట్టుకి కట్టేసి దాడి చేసిన బాధితురాలు శిరీషాకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. సీఎం ప్రకటించిన రూ. 5 లక్షల చెక్కును కడ పీడీ వికాస్ మర్మత్, టీడీపీ నాయకులు ఆమె అందచేశారు.

స‌ర్వేప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌లో ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సంత‌కం ఫోర్జరీ కేసులో సిట్ విచార‌ణ కూడా కొన‌సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి బుధ‌వారం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న కాకాణి గోవ‌ర్థన్‌రెడ్డిని నెల్లూరు కోర్టుకు తీసుకొచ్చారు.

ముగ్గురు వ్యక్తులపై రెండు ఎలుగుబంట్లు దాడి చేశాయి. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రజలతో కలసి ఆయన 14 పార్కులకి శంఖుస్థాపన చేశారు. ప్రభుత్వ స్థలాల జోలికొస్తే తాట తీస్తానని…రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తానని కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ…ప్రతిపక్షాల విమర్శలకు సీఎం చంద్రబాబు ధీటైన సమాధానం చెప్పారని ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ తెలిపారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

చిత్తూరు పట్టణాన్ని పోలీసులు డ్రోన్ నిఘాతో జల్లెడ పట్టారు. బహిరంగ ప్రదేశాలు, మహిళల రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. మహిళల భద్రతే ద్యేయంగా చిత్తూరు పోలీసులు పనిచేస్తామని ఎస్పీ మణికంఠ చందోలు చెప్పారు.

ఆదర్శ గ్రామంగా కందలవారిపల్లి గ్రామం ఎంపికైందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. ధర్తి ఆబ జన్ భగిదరి అభియాన్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాళ్ల అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తరించారు.

అంగన్వాడీ కార్యకర్త నజియాపై వైసీపీ కో ఆప్షన్ మెంబర్ అక్తర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక వైద్యశాలకు తరలించారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని ఆత్మకూరు ఆర్డీవో పావని ఆదేశించారు. ఏఎస్పేట క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను ఆమె అధికారులతో కలసి సందర్శించారు.

గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి రైతులకు సిసిఆర్సి కార్డులు ఇస్తామని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. సంగంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకి పలు సూచనలు, సలహాలు చేశారు.

సీఎం చంద్రబాబు మహిళల పక్షపాతి అని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాళ్లపాక అనూరాధ తెలిపారు. తల్లికి వందనం పథకం అమలుపై 16వ డివిజన్లో ఆమె స్థానిక టీడీపీ శ్రేణులతో కలసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు.

ఏసీ నగర్లోని మల్లెల సంజీవయ్య హైస్కూ్ల్ ని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సందర్శించారు. నెల్లూరు నగరంలోనే ఈ స్కూల్ ని ఉత్తమ హైస్కూల్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో రామచంద్రాపురంలో గ్రామంలో వాలీబాల్ కోర్ట్ ని ప్రారంభించుకోవడం జరిగిందని మత్స్యకార నాయకులు ఆవుల వాసు తెలిపారు. వాలీబాల్ కోర్ట్ ని ఆయన గ్రామ కాపులు, యువతతో కలసి ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *