మీడియా సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు
అర్హత ఉన్నవారే విమర్శించాలి…
- మీడియా సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు
తాము ఏమి చేసినా… సమావేశాలు నిర్వహించినా ప్రజలకు మంచి చేయటం కోసమేనని… ప్రతిపక్షాన్ని విమర్శించేటప్పుడు అర్హత ఉన్న వారిచే విలేకరుల సమావేశం నిర్వహించాలని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీర చలపతిరావు హితవు పలికారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలోని ఆయన నివాసంలో నియోజకవర్గ వైసిపి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోవూరు నియోజకవర్గంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ప్రభుత్వ వైఫల్యాలపై జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించడం జరిగిందన్నారు. దీనికి విశేష స్పందన వచ్చిందని అన్నారు. అనంతరం తమ నాయకుడైన నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి పై పెయిడ్ ఆర్టిస్టులతో పాటు, జోకర్లతో , కనీసం సర్పంచులుగా గెలవని వారితో ఇష్టానుసారంగా అభివృద్ధి సంక్షేమాలను వదిలేసి మాట్లాడటం సరి కాదన్నారు. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు స్థానం లేదని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నేను చెబుతూనే ఉన్నా అంటున్నారు కానీ… గ్రావెల్ ,ఇసుక, లిక్కర్, గంజాయి మాఫియాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఒక పింఛను తప్ప మిగతావి ఏ హామీలు నెరవేర్చలేదన్నారు. రాజుపాలెంలో స్థానిక నాయకులు వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా తెచ్చినవి రూపాయి అయినా ఖర్చు పెట్టారా, పెట్టుంటే ప్రజలకు అందయో లేదో తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో. నియోజకవర్గ వైసిపి నాయకు కార్యకర్తలు పాల్గొన్నారు.