అంగన్వాడీ కార్యకర్తపై కత్తితో దాడి

దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ కో ఆప్షన్ మెంబర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి

కుప్పం టీడీపీ నాయకులు డిమాండ్

అంగన్వాడీ కార్యకర్తపై కత్తితో దాడి..

  • దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ కో ఆప్షన్ మెంబర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
  • కుప్పం టీడీపీ నాయకులు డిమాండ్


అంగన్వాడీ కార్యకర్త నజియాపై వైసీపీ కో ఆప్షన్ మెంబర్ అక్తర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక వైద్యశాలకు తరలించారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.


అంగన్వాడీ కార్యకర్తపై వైసీపీ కో ఆప్షన్ మెంబర్ కత్తితో దాడికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు స్థానిక వైద్యశాలకు తరలించారు. బాధితురాలు అంగన్వాడీ కార్యకర్త నజియా వివరాల మేరకు… కుప్పం మండలం రాగిమనుమిట్ట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా నజియా బేగం గత 15 సంవత్సరాలుగా పనిచేస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన వైసీపీ కో ఆప్షన్ సభ్యుడు అక్తర్ తరచూ వేధిస్తుండేవాడని భాదితులకు బోరున విలపించింది. గతంలో తరచూ తనను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడని… అన్ని భరించినా అతని ఆగడాలు మితిమీరి పోయాయని తన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ రోజు తాను గ్రామంలో ఉన్న సమయంలో తనను కావాలనే నీటి కోసం వేచి ఉన్న సమయంలో గొడవకు దిగాడ, వచ్చిన వెంటనే నీ అంతు చూస్తానని హెచ్చరించడం కాకుండా కత్తులతో దాడి చేసినట్టు భాదితురాలు తెలిపింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తన భర్త ఆసుపత్రికి తరలించారు. కాగా టీడీపీ సానుభూతి పరురాలు వైసీపీ నాయకుని దాడిలో గాయపడిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని భాదితురాలిని పరామర్శించారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ… కుప్పంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వారు అధికారంలో ఉన్నట్టు విచ్చలవిడిగా ప్రజలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని మహిళలపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *