బాలాయపల్లిలో నిరసనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు
3,4,5 తరగతుల తరలింపు ఆపాలి
- బాలాయపల్లిలో నిరసనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు
తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం అలిమిలి గ్రామ అరుంధతివాడ ప్రాధమిక పాఠశాలలో 35 మంది విద్యార్దులు చదువు కుంటున్నారు. గ్రామంలోనే పాఠశాల ఉండాలని… వేరే గ్రామానికి వెళ్ళి తమ పిల్లలు చదువు కొనసాగించలేరని అలిమిలి అరుంధతివాడ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. మా గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న 3,4,5 తరగతుల పిల్లలను సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నూరు గ్రామంలోని పాఠశాలకు వెళ్ళేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారని తెలుసుకున్న గ్రామస్దులు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పాఠశాలవద్దకు వెళ్ళి తమ పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నూరు గ్రామానికి మా పిల్లలు వెళ్ళలేరని, పాఠశాలలను ఎలా ఎత్తేస్తారని ప్రశ్నించారు. మా గ్రామంలోనే పాఠశాల ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ సురేష్, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.