కుప్పం డీఎస్పీ పార్ధసారధి వెల్లడి
నలుగురిపై అటెంప్ట్ టూ మర్డర్ కేసు..
- కుప్పం డీఎస్పీ పార్ధసారధి వెల్లడి
నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… మునెప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే నలుగురు బాధిత మహిళ శిరీషను చెట్టుకు కట్టి, కొట్టారన్నారు. వాట్సప్ లో ఫోటో రాగానే, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్ట్ చేసి నలుగురిపై అటెంప్ట్ టూ మర్డర్ కేసు నమోదు చేశామని చెప్పారు. శిరీష తమ పిల్లలకు స్కూల్ TC తీసుకోవాలని సోమవారం గ్రామానికి వచ్చిందని తెలిపారు. శిరీష పై మునెప్ప కుటుంబీకులు దౌర్జన్యం చేసి, అడ్డుకొని చెట్టుకు కట్టివేశారన్నారు. ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. రాజకీయాలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత మహిళ శిరీష పై దాడి చేసిన నలుగురిని రిమాండ్ కు తరలిస్తున్నామని వెల్లడించారు.