బదిలీపై వెళ్లడం బాధాకరం
డిప్యూటీ డైరెక్టర్ సదారావును ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు
డీడీ సేవలు మరువలేనివి…
- బదిలీపై వెళ్లడం బాధాకరం
- డిప్యూటీ డైరెక్టర్ సదారావును ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు
నెల్లూరు జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి సదారావు విశాఖపట్నంకి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన్ని జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఫోటోగ్రఫర్లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. నెల్లూరు కలెక్టరేట్ లో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా సదారావు గత రెండేళ్లుగా జర్నలిస్టులకి ఎనలేని సేవలు అందించాలని జర్నలిస్టులు కొనియాడారు. ఆయన బదిలీపై వెళ్లడం బాధాకరమన్నారు. అనంతరం సదారావు మీడియాతో మాట్లాడుతూ….నెల్లూరు జర్నలిస్టులందరూ తనకు బాగా సపోర్ట్ చేశారన్నారు. తన ఉద్యోగానికి కలెక్టర్లు ఎంతో సహకరించారన్నారు.