తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ డిమాండ్
చిత్తూరులో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా…
- తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ డిమాండ్
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ జిల్లా అధ్యక్షురాలు షకీలా, జిల్లా కోశాధికారి సృజన మాట్లాడుతూ… ప్రభుత్వం పథకాలు తమకు ఏమీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై రాష్ట్ర ప్రభుత్వం రోజు రోజుకు పని భారం పెంచుతుందన్నారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తమ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.