కావలిలోని రెడ్ ఫీల్డ్ పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా ఆపరేషన్ సింధూర్ పై విద్యార్థుల డ్రామా భారతదేశ సైనిక శక్తిపై అవగాహన కలిగేలా విద్యార్థుల డ్రామా అని తెలిపిన ప్రిన్సిపాల్
విద్యార్థుల ఆపరేషన్ సింధూర్
- కావలిలోని రెడ్ ఫీల్డ్ పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా ఆపరేషన్ సింధూర్ పై విద్యార్థుల డ్రామా
- భారతదేశ సైనిక శక్తిపై అవగాహన కలిగేలా విద్యార్థుల డ్రామా అని తెలిపిన ప్రిన్సిపాల్
పాఠశాల పున: ప్రారంభం సందర్భంగా ఆపరేషన్ సింధూర్ డ్రామాను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. మన సైనిక శక్తిపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులచే డ్రామా కార్యక్రమం చేపట్టినట్లు రెడ్ ఫీల్డ్ పాఠశాల ప్రిన్సిపాల్ అభినవ్ తెలిపారు.
నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులోని రెడ్ ఫీల్డ్ పాఠశాలలో ఆపరేషన్ సింధూర్ డ్రామాను విద్యార్థులు రక్తి కట్టించారు. సోమవారం పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపాల్ అభినవ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతదేశ సైనిక శక్తి ప్రపంచ దేశాలకు తెలియజేశారన్నారు. మన సైనిక శక్తిపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులచే డ్రామా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయిని ఓలి మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.