కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి
కేంద్ర కారాగారంలో కాకాణితో ములాఖత్ అయిన వైసీపీ నేతలు
ప్రజలే భూ స్థాపితం చేస్తారు
- కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి
- కేంద్ర కారాగారంలో కాకాణితో ములాఖత్ అయిన వైసీపీ నేతలు
:
నెల్లూరు కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాణితో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన వైసీపీ నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు.
అక్రమ మైనింగ్ వ్యవహారంతోపాటు అట్రాసిటీ కేసుల్లో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ శిక్ష అనుభవిస్తున్న కాకాణి గోవర్థన్రెడ్డిని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మాజీఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలతో కలసి మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ములాఖత్ అయ్యారు. అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టించడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం కాదని…ప్రజలే కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దారుణాలన్నింటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.