కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్
పోర్ట్ రాకుండా అడ్డుకుంది సీఎం చంద్రబాబే
- కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్
దుగ్గరాజుపట్నం పోర్ట్ మన ప్రాంతానికి రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. పోర్టు నిర్మాణం జరిగి ఉంటే రైతులు, నిరుద్యోగులు ఆర్థికంగా,ఉపాధి పరంగా బలోపేతం అయ్యేవారని ఆయన అన్నారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు పోర్ట్ రానివ్వకుండా నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రభుత్వ శాఖలు అవినీతితో నిండిపోయాయని చింతామోహన్ విమర్శించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో దుగ్గరాజుపట్నం వెంటనే నిర్మించాలని మోహన్ డిమాండ్ చేశారు.