యోగా నిపుణుల నేతృత్వంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు
నారాయణ మెడికల్ కాలేజీలో యోగాంధ్ర
- యోగా నిపుణుల నేతృత్వంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు
నెల్లూరు చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల క్యాంపస్ లో…. యోగాంధ్ర 2025 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది, ఆరోగ్యాభిలాషులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరి చేత… అనుభవజ్ఞులైన యోగా నిపుణుల నేతృత్వంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు వేయించారు. సహజ చికిత్సా పద్ధతులపై నేచురోపతి సెషన్లు, ఆహార నియమాలు, జీవనశైలి మార్పులపై అవగాహన కల్పించారు. సంప్రదాయ వైద్య పద్ధతులను ఆధునిక వైద్య శాస్త్రంలో కలిపి ప్రజల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నారాయణ మెడికల్ కళాశాల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు ముందు ఉంటుందన్నారు.