వింజమూరులో ఉచిత కంటి వైద్య శిబిరం – సుమారు 900 మందికి కంటి పరీక్షలు
కంటిని కాపాడుకుందాం
- వింజమూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
- సుమారు 900 మందికి కంటి పరీక్షలు
నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక వై ఆర్ జె సి కాలేజ్ ప్రాంగణంలో ఎనిమిదో తేదీ నుండి నిర్వహించే శంకర్ నేత్రాలయ కంటి వైద్య పరీక్షలు నేటితో ముగింపు దశకు చేరుకున్నాయని కార్యనిర్వాహకులు యల్లాల రఘురామిరెడ్డి తెలిపారు. ఉచిత కంటి వైద్యశిబిరం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం చాలా హర్షణీయమన్నారు. ఈ శిబిరాన్ని నిర్వహించేందుకు షేగు సతీష్ కుమార్ కుటుంబ సభ్యుల ఔదార్యానికి మనమెంతో రుణపడి ఉంటామన్నారు. చెన్నై వారి శంకర నేత్రాలయ వారి సౌజన్యంలో సుమారు 900 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 176 మందికి ఇక్కడే శిబిరం వద్ద మొబైల్ వాహనంలో కంటి శస్త్రసికిత్సలు చేశారు. మరో 159 మందిని వివిధ లోపాలు ఉన్నవారిని చెన్నైకి రిఫరల్ చేశారని ఆయన అన్నారు. కమిటీ సభ్యులు నేత్ర వైద్యశాల వైద్య బృందాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్ సుజనా, ప్రభుత్వ వైద్యాధికారి జి మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్ పద్మనాభం, శంకర్ నేత్ర వైద్యాలయ పి ఆర్ ఓ రంజిత్ కుమార్,రోగులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.